విత్తే పద్ధతి: 

భూమి మీద పాకించే పాదులకు, వర్షాకాలంలో నీటి కాలువలకు తోడుగా మురుగు నీరు పోవటానికి 2 మీ. దూరంలో కాలువలు చేయాలి. 

వేసవిలో వేసే పాదులకు పొలం అంతటా నీటి పారుదల కొరకు బోదెలను చేయాలి. 

అన్ని రకాల పాదులకు 3 విత్తనాలను 1-2 సెం.మీ. లోతులో విత్తుకోవాలి. 

దొండకు చూపుడు వేలు లావుగల కొమ్మలు 4 కణుపులు గలవి 2 చొ||న నాటుకోవాలి. 

అన్ని తీగ జాతి కూరగాయలను వర్షాధార పంటకు 15x10 సెం.మీ. కొలతల గల పాలిథీన్ సంచుల్లో విత్తుకొని 15-20 రోజులు పెరిగిన తర్వాత అదును చూసుకొని పొలంలో నాటుకోవాలి.